పార్టీ మారనున్న రేవంత్ రెడ్డి..? తెరాస తట్టుకోగలదా..?

Thursday, June 13th, 2019, 09:58:02 AM IST

రాజకీయ నాయకులకు ముఖ్యంగా ఉండవలసింది ముందు చూపు.. రాబోవు రోజుల్లో తమ రాజకీయ జీవితం ఎలా ఉంటుందో లెక్కలు వేసుకొని మరి వాళ్ళు రాజకీయాలు చేయాలి.. ఇందులో భాగంగా అవసరం అయితే తమకి రాజకీయంగా జన్మనించిన పార్టీని సైతం కాలదన్ని మరొక పార్టీలోకి వెళ్ళిపోతారు, అక్కడ కూడా కుదరకపోతే మరొక పార్టీ మారిపోతుంటారు.. తాజాగా తెలంగాణ టైగర్ అని ముద్దుగా పిలుచుకునే రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పేసి, కాషాయ రంగు పులుముకోవటానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది.

బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితులు లేవని, తెరాసకి ప్రధాన ప్రత్యూర్ది పార్టీగా బీజేపీ ఎదిగే అవకాశం ఉందని భావించిన కొందరు నేతలు బీజేపీ పార్టీలోకి చేరటానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, కెసిఆర్ అన్న కూతురు కల్వకుర్తి రమ్య రావు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో ఢిల్లీ స్థాయిలో మంతనాలు సాగించినట్లు తెలుస్తుంది.

రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నాడు అంటే ఒక్కడే పార్టీ నుండి వెళ్లకుండా తన వెంట మరో నాలుగు నాయకులను కూడా తీసుకోని వెళ్తాడు.. గతంలో టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే చేశాడు.. ఇప్పుడు బీజేపీ లోకి వెళ్ళటానికి సిద్ధం అవుతున్న తరుణంలో తన వెంట మరికొందరు ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక తెలంగాణ లో టీడీపీకి కొద్దో గొప్పో మిగిలిన ఉన్న నాయకులు కూడా కమలదళంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇలా అన్ని నది జలాలు వెళ్లి బీజేపీ మహా సముద్రంలో కలిస్తే ఆ ప్రవాహాన్ని తట్టుకొని నిలబడటం కెసిఆర్ కి సాధ్యమేనా అనే అనుమానులు కూడా వ్యక్తం అవుతున్నాయి..