ఈ నెల 18 న “స్పీకప్ తెలంగాణ” అంటున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్!

Monday, July 13th, 2020, 12:00:54 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే కరోనా వైరస్ కట్టడికి రాష్ట్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విఫలం అని విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుక వినిపించేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక వేదికను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 18 న స్పీకప్ తెలంగాణ అంటూ ఒక కార్యక్రమ చేపట్టనుంది. సోషల్ మీడియా ద్వారా ప్రజలు తమ ఆందోళనలు తెలపాలి అని సూచించడం జరిగింది.

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం, ఆరోగ్యం, విద్య సమస్యల పై పీసీసీ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే సంబందించిన సమావేశం లో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కరోనా ను అరికట్టడం లో విఫలం అయింది అని ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ 13 రోజులుగా అదృశ్యమవడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. అయితే ఈ స్పీకప్ తెలంగాణ లో ప్రజల అభిప్రాయాలను ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు వెల్లడించడానికి అవకాశం కల్పిస్తూ, ఈ వివరాల ద్వారా కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కి కాంగ్రెస్ పార్టీ తగు సలహాలు, సూచనలు చేయనుంది.