తెలంగాణ కాంగ్రెస్‌కి షాక్.. టీఆర్ఎస్‌లో చేరిన కౌన్సిలర్లు..!

Friday, June 26th, 2020, 03:00:47 AM IST


తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పలువురు కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ వీడిని టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

మహబూబ్ నగర్ పట్టణంలోని 12వ వార్డు హనుమాన్ పుర కౌన్సిలర్ షేక్ ఉమర్ పాషా(కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్, 27వ వార్డు కౌన్సిలర్ సంధ్య శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనే టీఆర్ఎస్ లో చేరుతున్నారు. దశాబ్దాలుగా వెనక బడ్డ పాలమూరు ఇప్పుడిప్పుడే ప్రగతి పథంలో పరుగులు పెడుతుందన్నారు.