బిగ్ బ్రేకింగ్: కాంగ్రెస్ పార్టీనీ వీడి గులాబీ గూటికి చేరనున్న మరో ఎమ్మెల్యే..!

Thursday, June 6th, 2019, 02:46:35 PM IST

తెలంగాణలో ఈ దఫా జరిగిన ముందస్తు ఎన్నికలలో ఘోర పరాభవం ఎదురైంది. కూటమిగా ఏర్పడి విజయం సాధిద్దాం అనుకున్న కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. టీఆర్ఎస్ భారీ మెజారిటీని సంపాదించుకుని వరుసగా రెండో సారి విజయాన్ని సాధించింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 19 స్థానాలను మాత్రమే గెలుచుకుని ప్రతిపక్ష హోదాకి పరిమితమైంది. అయితే ఇప్పటికే గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో 11 మంది పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్‌లోకి చేరిపోయారు.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాని కూడా కోల్పోయింది. అయితే తాజాగా తాండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పైలట్‌ రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పనున్నారు. ఏడాది క్రితం టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన రోహిత్ రెడ్డి అనంతరం కాంగ్రెస్‌లో చేరి తాండూరు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అయితే ఇంతకు ముందే టీఆర్‌ఎస్‌ నేతలతో చర్చలు జరిపిన రోహిత్‌రెడ్డి గురువారం ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. దీనితో ఫైలెట్ కూదా పార్టీనీ వీడుతున్నారని సమాచారం. అయితే నల్లగొండ ఎంపీగా గెలుపొందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక పార్టీ నుంచి రోహిత్ రెడ్డి కూడా వీడి టీఆర్ఎస్‌లో చేరితే కాంగ్రెస్‌లోని ఎమ్మెల్యేల సంఖ్య 5కి పడిపోతుంది. అయితే రోహిత్ రెడ్డి పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతారా లేక కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా అనే చర్చలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాఫిక్‌గా నడుస్తున్న విషయం.