నా ఒక్కడి పై కేసు ఎందుకు పెట్టారు – వి హెచ్

Thursday, July 30th, 2020, 09:00:38 PM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ కి చికిత్స అందిస్తున్న అతి ప్రాముఖ్యత కలిగిన ఆసుపత్రి ఉస్మానియా గాంధీ ఆసుపత్రి. అయితే ఈ ఆసుపత్రి ను సందర్శించేందుకు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు పై పోలీసులు కేసు పెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెరాస ప్రభుత్వం విపక్షాల పై కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది అని వి. హనుమంతరావు అన్నారు. దళితులు చనిపోతే చూడటానికి వెళ్ళగా అడ్డుకున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే మంత్రులు కొందరు వాస్తవాలను వక్రి కరిస్తున్నారు అని వి హెచ్ తన అభిప్రాయం వెల్లడించారు. పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలం లో నిర్మాణం పూర్తి అయిన తరువాత పాత ఆసుపత్రి భవనం ను బాగు చేయాలి అని డిమాండ్ చేశాను. కానీ ఇది చెప్పడానికి వెళ్తే కేసు నమోదు చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే తెరాస నేతలు కూడా వెళ్ళారు అని, కానీ నా ఒక్కడి పై మాత్రం కేసు ఎందుకు పెట్టారు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ను నిలదీశారు. ఇలా ఆసుపత్రి ను నిర్మించమని చెప్పినందుకు కేసులు పెడతారా అని సూటిగా ప్రశ్నించారు. అయితే సచవాలయానికి సంబంధించి చర్యలు వేగంగా తీసుకుంటున్నారు, ఆసుపత్రి కోసం ఎందుకు తీసుకోవడం లేదు అని అన్నారు.