ఛలో ట్యాంక్‌బండ్.. ఆర్టీసీకీ మద్ధతుగా కాంగ్రెస్ పిలుపు..!

Saturday, November 9th, 2019, 12:20:54 AM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 35వ రోజుకు చేరుకుంది. తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం ఆర్టీసీ కార్మికులు విధులను వదిలేసి నిరసన చేపడుతున్నా ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించేందుకు ముందుకు రావడంలేదు. అయితే సమ్మెలో భాగంగా రేపు ఛలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఆర్టీసీ కార్మికులు.

అయితే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం కాంగ్రెస్ పార్టీ వారికి ఎప్పటికి మద్ధతు తెలుపుతుందని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆర్టీసీ జేఏసీ తమ మద్దతు కోరిందనీ, అందుకోసం శనివారం చేపట్టే కార్యక్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు హైకోర్ట్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశిస్తున్నా, ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా, నియంతలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.