గుజరాత్ ఎన్నికల ముందు బిజెపికి చావు దెబ్బ..దుమ్ముదులిపిన కాంగ్రెస్..!

Friday, October 13th, 2017, 09:16:34 AM IST

కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండడంతో ఎక్కడ చూసినా ఆపార్టీ పరాభవమే కనిపిస్తోంది. అధికారం కోల్పోయి చాలా ఏళ్ళైనా యూపీ వంటి చోట్ల కూడా మోడీ మానియాతో బిజెపి తిరుగులేని విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మహారాష్ట్ర లో బీజేపీదే మరియు మిత్ర పక్షం శివసేన అధికారంలో ఉన్నాయ్. ఈ రెండు పార్టీలకు దిమ్మతిరిగేలా షాకిచ్చింది కాంగ్రెస్. నాందేడ్ నగరానికి జరిగే మున్సిపల్ ఎన్నికలంటే అధికార పార్టీ అవలోకగా విజయం సాధిస్తుందనే అంచనాలు ఉంటాయి. కానీ అంచనాలని తల్లకిందులు చేసేలా 54 డివిజన్ లలో 49 డివిజన్ లని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

ఫలితంగా బిజెపి పరువు పోయింది. మరి కొన్ని నెలల్లో మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ వ్యతిరేకతని ప్రాజెక్ట్ చేసేందుకు తమకు నాందేడ్ మున్సిపల్ ఎన్నిక ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా నాందేడ్ ఎన్నిలకు, గుజరాత్ లో జరగబోయే ఎన్నికలకు సంబంధం లేదని బిజెపి అంటోంది. ఇది కేవలం మున్సిపల్ ఎన్నిక మాత్రమే అని లైట్ తీసుకుంటోంది.

  •  
  •  
  •  
  •  

Comments