కరోనా అప్డేట్ : హైదరాబాద్ లో పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్స్..!

Wednesday, June 3rd, 2020, 07:08:12 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది. వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500 కు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇప్పటి వరకూ గ్రేటర్ హైదరాబాద్ లో 1800 కి పైగా కేసులు నమోదు అయ్యాయి. అంతేకాక గత వారం లో హైదరాబాద్ లో 72 కంటైనేమేట్ జోన్స్ ఉన్నాయి, అవి కాస్త ఇపుడు 150 కి చేరాయి.అయితే హైదరాబాద్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నప్పటికీ ప్రజలు మాత్రం పలు చోట్ల లాక్ డౌన్ ను పాటించడం లేదు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 2891 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 92 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. అయితే కరోనా వైరస్ భారీ నుండి కోలుకుంటున్న వారీ సంఖ్య సైతం రోజురోజుకీ పెరుగుతోంది. అయితే కరోనా వైరస్ కి వాక్సిన్ లేకపోవడం తో రాష్ట్రం లో పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఆఖరికి కరోనా వైరస్ కి సంబంధించిన వాక్సిన్ అందుబాటు లో ఉండే అవకాశం ఉంది అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తికి ఇపుడు ప్రజలే బాధ్యత వహించాల్స ఉంటుంది అని పలువురు ప్రముఖులు అంటున్నారు. లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తి వేస్తూ ఉండటం తో ఇక స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనా వైరస్ ను అరికట్టడానికి మార్గం అని తెలుస్తోంది.