బాలీవుడ్ సంజు సినిమాకు కొత్త చిక్కులు ?

Thursday, June 14th, 2018, 09:44:19 AM IST

ఈ ఏడాది బాలీవుడ్ జనాల్లో అత్యంత క్యూరియాసిటీ నింపిన చిత్రం సంజు. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ బయోపిక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్స్ తో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో తాజాగా ఈ సినిమాకు కొత్త చిక్కులు చుట్టుముట్టాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ని చుసిన సామజిక కార్యకర్త ప్రిద్వి కేసు వేసాడు. ఈ ట్రైలర్ లోని ఓ సన్నివేశంలో సంజు జైలులో ఉండగా .. ఆతడి గదిలోని టాయిలెట్ లీకేజ్ వల్ల మురుగు నీరంతా గదిలోకి విస్తరించినట్టు చూపించారు. దాంతో ఈ సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇలాంటి సన్నివేశాలను తొలగించాలని లేదంటే భారతీయ జైళ్లపై చేదు అభిప్రాయం వస్తుందని, ఈ సన్నివేశాన్ని తొలగించాలని అయన తెలిపారు. లేదంటే ఈ కేసును కోర్టులో వేస్తానని చెప్పడమే కాకుండా సెన్సార్ బోర్డు వారికీ లేఖ రాసాడు. దాంతో ఈ సన్నివేశాన్ని తొలగిస్తారో ఏమో గాని .. ఈ సినిమా పై ఇంకెన్ని చిక్కులు వస్తాయో అని యూనిట్ టెన్షన్ మీదుంది.

  •  
  •  
  •  
  •  

Comments