హాట్ టాపిక్ : ఆరాధ్య పేరు కాపీ కొట్టేశారా?

Tuesday, October 24th, 2017, 10:15:48 AM IST

డ్రీమ్‌గాళ్ హేమ‌మాలిని అమ్మ‌మ్మ అయ్యార‌న్న వార్త వెలువ‌డిన 24 గంట‌ల్లోనే.. మ‌న‌వ‌రాలి పేరును ప్ర‌క‌టించి సెన్సేష‌న్ సృష్టించింది ఆ కుటుంబం. హేమ‌మాలిని కుమార్తె ఇషాడియోల్ -భ‌ర‌త్ త‌క్‌టానీ జంట‌కు జ‌న్మించిన క్యూట్ చిన్నారికి అప్పుడే నామ‌క‌ర‌ణం చేసేశారు. అదృష్టం క‌లిసొస్తే.. న‌డిచొచ్చిన ల‌క్ష్మీదేవికి ఇంత‌కీ ఏం పెట్టారు? అంటారా?

పేరు `ర‌ధ్య‌`. ఆర్ అనే ఆంగ్ల అక్ష‌రంతో పేరు మొద‌ల‌య్యేలా ప్లాన్ చేశారు. అయితే ఈ పేరు విన‌గానే వెంట‌నే షాక్‌కి గుర‌వ్వ‌ని వారు ఉండ‌రు. ఎందుకంటే .. మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ – అభిషేక్ బ‌చ్చ‌న్ జంట‌కు జ‌న్మించిన గారాల ప‌ట్టీ పేరు ఆరాధ్య‌. అందులోంచి `ఆ` అనే అక్ష‌రం తొల‌గించి మిగ‌తా రెండ‌క్ష‌రాల‌తో .. అంటే `ర‌ధ్య‌` అని పెట్టుకున్నారా? అంటూ లాజిక్ వెతుకుతున్నారంతా. బాలీవుడ్ వాళ్లు అన్నిటా కాపీ క్యాట్ గాళ్లు అంటూ ఒక‌టే ప్ర‌చారం ఉంది. ఇప్పుడిలా కూతుళ్ల పేర్లు కాపీ కొట్టేస్తున్నారా? అంటూ మాట్లాడుకుంటున్నారు. ఆరాధ్య త‌ర్వాత ర‌ధ్య అనేంత అర్థం వ‌చ్చేలా.. గూగుల్ సెర్చ్‌కి సులువుగా దొరికేసేలా ఇలా ప్లాన్ చేశారో ఏంటో .. అంటూ ఒక‌టే గొణుగుడు మొద‌లైంది. ఏమో ! ఎవ‌రిష్టం వాళ్ల‌ది!!