దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు, మరణాలు..!

Tuesday, September 29th, 2020, 10:30:41 AM IST

భారత్‌లో కరోనా కేసులు కేసుల సంఖ్య కాస్త తగ్గుతూ వస్తుంది. ఇదివరకు దాదాపు రోజుకు లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతుండగా, వెయ్యికి పైగానే మరణాలు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 70,589 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో 776 మంది మాత్రమే చనిపోయారు.

అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 61,45,292 కి చేరగా ప్రస్తుతం అందులో 9,47,576 యాక్టివ్ కేసులు ఉండగా, 51,01,398 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 96,318 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 84,877 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,42,811 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 83.0 శాతం ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది.