బిగ్ న్యూస్ : ఏపీలో కొనసాగుతున్న భారీ కరోనా కేసులు.!

Sunday, June 28th, 2020, 02:34:37 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే. ప్రతీరోజు కూడా రికార్డు స్థాయి కరోనా కేసులు ఇప్పుడు నమోదు అవుతున్నాయి. అయితే ఇదిలా ఉండగా ఓ పక్క అత్యధిక శాంపిల్స్ సేకరణ విషయంలోనూ అలాగే నమోదు అవుతున్న కేసుల విషయంలోనూ ఏపీలో భారీ ఎత్తున లెక్కలు నమోదు అవుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో 25 వేల 778 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే 755 భారీ కేసులు నమోదు అయ్యినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు. అలాగే వీటితో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి మరియు విదేశాల నుంచి వచ్చిన వారితో కలిపి మొత్తం 813 కేసులు నమోదు అయ్యాయి.

వీటితో ఏపీలో మొత్తం 10 వేల 848 కేసులు నమోదు కాగా గడిచిన 24 గంటల్లో భారీ ఎత్తున 401 మంది డిశ్చార్జ్ కాగా 11 మంది మరణించినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు.