బ్రేకింగ్ : ఏపీలో నెమ్మదిస్తున్న కరోనా..కొత్త కేసులు లెక్కలు ఇవే.!

Wednesday, July 1st, 2020, 01:32:30 PM IST

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ప్రతీ రోజూ భారీ ఎత్తున టెస్టులు చేస్తుండడంతో అంతే భారీగా పాజిటివ్ కేసులు కూడా వస్తున్నాయి. గత నెల రోజుల నుంచి భారీగా నమోదవుతున్న కేసులు ఇప్పుడు కాస్త ఆమోదించాయని చెప్పాలి ఒక్క మన ఏపీ రాష్ట్రంలో ప్రతిరోజు 700 కేసులు నమోదయ్యే వి కానీ ఇప్పుడు 600 ఆ మార్క్ పడింది.

మొన్న ఏపీలో మొత్తం కేసులు 648 రాగా ఈసారి గడిచిన 24 గంటల్లో మొత్తం 28 వేల 239 శాంపిల్స్ ను పరీక్షించగా మొత్తం 611 మందికి పాజిటివ్ వచ్చింది. ఇది మొన్న వచ్చిన కేసులు తో పోలిస్తే చాలా తక్కువే అని చెప్పాలి.

అలాగే ఇతర దేశాలు మరియు రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో గత 24 గంటల్లో మొత్తం 657 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఇది కాస్త ఊరట ఇచ్చే అంశమే అని చెప్పొచ్చు. అలాగే మొత్తం 362 మంది డిశ్చార్జ్ కాగా ఆరుగురు గత 24 గంటల్లో మరణించినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు.