GHMC పరిధిలో కరోనా కలకలం.. ఆ కార్పోరేటర్‌కి కూడా పాజిటివ్..!

Tuesday, June 23rd, 2020, 02:59:11 AM IST


తెలంగాణలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతుండడంతో అధికారులు కూడా ఈ ప్రాంతాలలో అనేక చర్యలు చేపడుతున్నారు.

అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కేసుల సంఖ్యలో మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించడంలేదు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 872 కేసులు నమోదు అయితే అందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 713 కేసులు ఉన్నాయంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అమీర్‌పేట్ కార్పోరేటర్‌తో పాటు అతని వెనుక ఉన్న ఐదుగురికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యిందని, మరో పక్క కాప్రా సర్కిల్ ఘంఛ్ కార్యాలయంలో 13 మంది సిబ్బందికి కూడా కరోనా సోకినట్టు తేలింది.