బ్రేకింగ్ : ఏపీలో మరోసారి భారీగా పెరిగిన కరోనా గ్రాఫ్..!

Sunday, May 24th, 2020, 01:20:50 PM IST

ఆంధ్ర రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్ర రూపం దాళుతున్నాయిదాలుస్తున్నాయి. కోవిడ్ పరీక్షలు పెంచితే ఒకానొక కాలం వరాక్యు పెరిగి తగ్గిపోతాయి అనుకుంటే ఊహించని విధంగా ఏపీలో కేసులు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ అనూహ్యంగా పెరుగుతూ వస్తున్నాయి.

పైగా ఇప్పుడు జిల్లాల వారీగా వివరాలను చూపించకపోతుండడంతో మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. అలా గత 24 గంటల్లో నమోదు కాబడిన కేసుల సంఖ్యను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు. గత 24 గంటల్లో 11 వేల 537 నమూనాలను పరీక్షించగా అందులో మొత్తం 66 కొత్త కేసులు నమోదు అయ్యినట్టుగా నిర్ధారించారు.

దీనితో ఏపీలో మొత్తం కేసులు 2 వేల 627 కు చేరుకున్నాయి. అయితే ఈ కొత్తగా నమోదు కాబడిన 66 కేసుల్లోనూ 17 కేసులు ఇతర దేశాల నుంచి వచ్చినవారే అని నిర్ధారించారు. అలాగే నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు సమయంలో 29 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.