బ్రేకింగ్ : ఏపీలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు.!

Saturday, May 30th, 2020, 03:55:24 PM IST

ఏపీలో కరోనా ఉదృతి ఏమంత ఆశాజనకంగా లేదని చెప్పాలి ఒకరోజు పెరిగితే మరోరోజు తగ్గిపోతున్నాయి. కానీ సగటున లెక్క చూస్తే మాత్రం ఏపీలో కరోనా రేటు పెరుగుతూనే పోతుంది. నిన్నటికి నిన్న కేవలం ముప్పైలలోనే నమోదు కాబడిన కేసులు ఇప్పుడు మళ్ళీ భారీ ఎత్తున పెరిగిపోయాయి.

గడిచిన 24 గంటల్లో 9 వేల 504 శాంపిల్స్ పరీక్షించగా అందులో 70 శాంపిల్స్ పాజిటివ్ వచ్చినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు. దీనితో ఏపీలో మొత్తం 2 వేల 944 కి చేరుకున్నాయి. అలాగే గత 24 గంటల్లో 55 మంది సంపూర్ణమైన ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యినట్టుగా నిర్ధారించారు. ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు వదులుతుందో ఏంటో ఎవరికీ అర్ధం కావడం లేదు.