బిగ్ న్యూస్ : ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా..లేటెస్ట్ కేసులు ఇవే.!

Tuesday, June 30th, 2020, 01:38:22 PM IST

గత కొన్నాళ్ల నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ భీభత్సం సృష్టించింది.దాదాపు మూడు వారాలు నిరంతరం ప్రతీ రోజు భారీ ఎత్తున కేసులు నమోదు అవుతుండడంతో కాస్త ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఇప్పుడు ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో ఏపీలో మొత్తం 18 వేల 114 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 648 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది.

అలాగే ఇతర దేశాలు మరియు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 56 మందికి పాజిటివ్ రావడంతో గత 24 గంటల్లో 704 కేసులు నమోదు అయ్యాయి. ఇది ఈ మధ్య కాలంలో కాస్త స్వల్పమే అని చెప్పాలి. కాకపోతే శాంపిల్స్ సంఖ్య తక్కువ ఉండడం కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. అలాగే గడిచిన 24 గంటల్లోనే 258 మంది డిశ్చార్జ్ కాగా ఏడుగురు మరణించినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు.