ఏపీలో దారుణం.. కరోనాతో చనిపోయాడని వృద్ధుడి శవాన్ని ప్రొక్లెయిన్‌తో..!

Saturday, June 27th, 2020, 12:00:19 AM IST


ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే ఏపీలో కరోనాతో చనిపోయిన ఓ వృద్ధుడిని ప్రొక్లెయిన్‌తో ఖననం చేయడానికి తీసుకెళ్ళిన ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ సీరియస్ అయ్యారు.

పేరాసిట్మాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోతుంది అని జగన్ గారు చెప్పిన రోజే వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అర్థం అయ్యిందని, శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటన దారుణమని అన్నారు. అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా అని పలాసలో 70 ఏళ్ల వృద్ధుడు చనిపోతే కరోనా లక్షణాలు ఉన్నాయి అని చెప్పి పార్థివదేహాన్ని ప్రొక్లెయిన్ తో ఈడ్చుకుంటూ వెళ్తారా అని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రవదలాలి. జగన్ రెడ్డి గారి మాటలకు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి సంబంధమే లేదని, ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తే ఇక ప్రజల్లో ఎలాంటి ఆందోళన ఉంటుందో ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలని అన్నారు.