ఫ్లాష్ న్యూస్: భారత్ లో 10 కి చేరిన కరోనా మృతులు!

Monday, March 23rd, 2020, 10:24:37 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. కరోనా వైరస్ సోకిన పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయినప్పటికీ ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఆగడం లేదని తెలుస్తుంది. తాజాగా కరోనా వైరస్ భారిన పడి ఒక వృద్దుడు మరణించారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రా కి వచ్చేముందు మార్చి 15 న యూఎస్ నుండి డిల్లీ వచ్చినట్లు సమాచారం. అయితే ఈ 69 ఏళ్ల వృద్దుడు మరణించడంతో భారతదేశంలో కరోనా వైరస్ భారిన పడి మరణించిన వారి సంఖ్య 10 కి చేరింది. అంతేకాకుండా ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 468 నమోదయ్యాయి.