కరోనా ఎఫెక్ట్ : అక్కడ వృద్ధుల కోసం అద్భుతమైన పని!

Wednesday, March 25th, 2020, 10:57:55 AM IST

కరోనా కారణంగా మన దేశం అంతటా మరో 21 రోజులు జనతా కర్ఫ్యూ ను మించే విధంగా లాక్ డౌన్ ను పాటించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా కట్టు దిట్టమైన భద్రత మరియు పటిష్టం అయ్యింది. అయితే ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లో మరింత ఎక్కువ భద్రతను ఏర్పాటు చెయ్యగా పశ్చిమ బెంగాల్ లో పోలీసులకు ఓ ఘటన ఎదురైందట.

కోల్ కత్తా ప్రాంతంలో కశిక అనే ఒక యువతికి ఓ అపార్ట్మెంట్ లో పదుల సంఖ్యలో వృద్ధులు కనిపించారట,వారంతా ఒంటరి జీవనం గడిపే వారు పిల్లలు వదిలేసిన వారే అట, అయితే ఆమె మొదటి నుంచే సంఘ సంస్కర్త కావడంతో వారందరికీ ధైర్యం చెప్పి వారికి కావాల్సిన ఆహార పదార్థాలు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చి సోషల్ మీడియాను కూడా ఎమన్నా అవసరం ఉంటే ఉపయోగించమని వారికి చెప్పి తర్వాత తన స్నేహితురాళ్ళకి ఈవిషయం చెప్పిందట.

కానీ ఈ లోపే లాక్ డౌన్ పడే సరికి మొత్తం మారిపోయే సరికి ఆ వృద్ధులు తమ సమస్యను సోషల్ మీడియా ద్వారా తెలిపేసరికి అది కశిక కు తెలిసింది. దానితో పోలీసుల సహాయంతో వారికి కావాల్సిన ఆహారపదార్ధాలు అని వారికి పంపించి ఈ 21 రోజులు పాపం వారు ఆకలితో మగ్గిపోకుండా ఆడుకుంది.