బ్రేకింగ్: అనాథ విద్యార్థి గృహంలో 45 మంది విద్యార్థులకు కరోనా..!

Monday, April 5th, 2021, 05:32:39 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఓ పక్క కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నప్పటికి పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో అనేక మంది విద్యార్థులు కరోనా బారిన పడడంతో విద్యాసంస్థలు కూడా మూసివేశారు. అయితే తాజాగా హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని చిత్ర లే అవుట్‌లో ఉంటున్న అనాథ విద్యార్థి గృహంలో ఉంటున్న 45 మంది విద్యార్థులకు కరోనా సోకింది.

అయితే అనాథ విద్యార్థి గృహంలో మొత్తం 100 మంది విద్యార్థులు ఉండగా అందులో ఏకంగా 45 మంది విద్యార్థులకు కరోనా సోకడంతో హాస్టల్ యాజమాన్యం, అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులను ఐసోలేషన్ గదుల్లో ఉంచి, మిగతా విద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.