గుడ్‌న్యూస్: కరోనా ఫస్ట్ డ్రగ్ ముందు తెలంగాణకే..!

Friday, June 26th, 2020, 01:31:07 AM IST


తెలంగాణకు చెందిన మందుల తయారీ సంస్థ హెటెరో ఉత్పత్తి చేస్తున్న కోవిడ్ 19 డ్రగ్ ఫస్ట్ బ్యాచ్ మన తెలంగాణకు కూడా రానుంది. అయితే ఫస్ట్ బ్యాచ్‌ డ్రగ్‌ను తొలుత ఐదు రాష్ట్రాలకు అందించాలని భావించిన కేంద్రం మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు తెలంగాణను కూడా చేర్చింది.

అయితే టెరో సంస్థ కోవిడ్ 19 నివారణలో భాగంగా తాజాగా రెమ్‌దేశీవైర్‌ పేరుతో ఓ మందును తయారీ, మార్కెటింగ్ కూడా చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే తొలి దశలో 20,000 డోస్‌లను తయ్యారు చేస్తామని, డ్రగ్ 100 మిల్లీగ్రాముల విలువ 5400గ ఉంటుందని, నాలుగు వారాలలో లక్ష డోస్‌లను తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.