లేటెస్ట్ రిపోర్ట్: సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కి కరోనా నెగిటివ్..!

Tuesday, June 30th, 2020, 08:53:44 PM IST


ప్రముఖ సినీ నిర్మాత, బండ్ల గణేశ్‌కి ఎట్టకేలకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఇటీవల కాస్త అనారోగ్యంతో హాస్పిటల్‌కి వెళ్ళగా అనుమానంతో అక్కడి డాక్టర్ ఆయనను కరోనా పరీక్ష చేయించుకోమని సూచించగా, వెంటనే బండ్ల గణేశ్ కరోనా టెస్టు చేయించుకున్నాడు.

అయితే ఆ టెస్టులలో కరోనా నెగిటివ్ అని తేలింది. దీంతో చిత్ర పరిశ్రమలో కలవరం ఏర్పడింది. అయితే ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుంటున్నబండ్ల గణేశ్‌కు తాజాగా టెస్టులు చేయగా నెగిటివ్ వచ్చినట్లుగా తేలింది. దీంతో ‘దేవుడికి ధన్యవాదాలు’ తెలుపుతూ, కరోనా టెస్ట్‌కి సంబంధించిన రిపోర్ట్‌ని బండ్ల గణేష్ పోస్ట్ చేశారు.