ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా పేషంట్.. నేరుగా సొంతూరుకు..!

Tuesday, July 14th, 2020, 08:34:13 AM IST

నల్గొండ జిల్లాలో ఆసుపత్రి నుంచి కరోనా పేషంట్ తప్పించుకుని పారిపోవడం తీవ్ర కలకలం రేపింది. మిర్యాలగూడ మండల యాద్గార్ గ్రామానికి చెందిన ఓ మహిళకు ఇటీవల కరోనా సోకింది. అయితే నల్గొండ ప్రభుత్వాస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

సోమవారం డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్‌ల కళ్లుగప్పి ఆసుపత్రి నుంచి తప్పించుకుంది. అయితే ఆసుపత్రి నుంచి తప్పించుకున్న ఆ బాధితురాలు నేరుగా తన సొంతూరు వెళ్ళిపోయింది. ఆమెను చూసి షాక్ తిన్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది వెంటనే ఆమెను మళ్ళీ ఆస్పత్రికి తరలించారు.