బ్రేకింగ్: తెలంగాణ సచివాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్..!

Tuesday, March 31st, 2020, 08:21:47 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటికే ఎనిమిది మంది చనిపోగా, 77 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అయితే తాజాగా తెలంగాణ సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ విభాగంలో పని చేస్తున్న ఓ సెక్షన్ ఆఫీసర్‌కి కూడా కరోనా సోకింది. ఇటీవలే ఢిల్లీ ప్రార్థనలకు ఆ ఆఫీసర్ వెళ్ళొచ్చారు. దీంతో ఆ ఉద్యోగిని గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా మంగళవారం సాయంత్రం కరోనా పాజిటివ్ అని తేలింది. అయియే ఆ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలడంతో సచివాలయం ఉద్యోగులలో ఒక్కసారిగా ఆందోళన మొదలయ్యింది. శానిటేషన్ చేయించారు.