బ్రేకింగ్ : ఏపీలో ఏమాత్రం మారని కరోనా..తాజా లెక్కలు ఇవే.!

Friday, May 22nd, 2020, 12:07:15 PM IST

ఇప్పుడు ఏపీలో నమోదు కాబడుతున్న మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేస్తున్న లెక్కల నిమిత్తం రాష్ట్ర ప్రజలు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నారు. ఇన్నాళ్ల వారీగా కేసులు బయటపెట్టి ఇప్పుడు కేవలం మొత్తం ఎన్నో కేసులు నమోదు అయ్యాయో మాత్రమే వెల్లడిస్తున్నారు.

అలా ఇప్పుడు గత 24 గంటల్లో నమోదు కాబడిన కేసుల లెక్కలను బయటపెట్టారు. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల నడుమ మొత్తం 8415 శాంపిల్స్ ను టెస్ట్ చెయ్యగా అందులో 62 పాజిటివ్ గా తేలాయి. దీనోతో మొత్తం ఏపీలో 2514 కరోనా కేసులు ఇప్పటి వరకు నమోదు అయ్యాయి.

అలాగే నిన్న ఒక్కరోజులోనే మొత్తం 51 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని డిశ్చార్జ్ కాగా ఒకరు మరణించినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు. ఈ అంశం పక్కన పెడితే అసలు ఎందుకని జిల్లాల వారీగా వెల్లడించడం లేదన్న అంశమే పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది.