బీ కేర్ పుల్: తెలంగాణలో కరోనా సామాజిక వ్యాప్తి ప్రారంభం..!

Thursday, July 23rd, 2020, 06:55:40 PM IST

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అయితే రాష్ట్రంలో కరోనా కమ్యూనిటీలోకి వెళ్లిందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రజలు ఇకపై అప్రమత్తంగా ఉండాలని, వచ్చే నాలుగైదు వారాలు చాలా క్లిష్టమైనవని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి ఉందని, ద్వితీయ శ్రేణి నగరాల్లో కేసులు పెరుగుతున్నాయని అన్నారు.

ఇకపై ఖచ్చితంగా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని అవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఇకపోతే కొందరు ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారని, ఏదైనా కరోనా లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.