డోంట్ మిస్: నరేంద్ర మోడీ వల్ల దేశం కరోనా భారీ నుండి ఇక తప్పించుకున్నట్లేనా?

Tuesday, March 31st, 2020, 03:36:09 PM IST


కరోనా వైరస్ ప్రభావం ఇతర దేశాల్లో గట్టిగానే ఉంది. చైనా లో మొదలైన మారణ హోమం, ఇపుడు అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలను వణికిస్తోంది. అయితే ఈ దేశాల్లో రోజుకి వందల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇలా జరగడానికి కారణం కరోనా రెండో దశ నుండి మూడో దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా ప్రాణాలు కోల్పోవడానికి కారణం ముందు జాగ్రత్త చర్యలు పాటించకపోవడమే. మొదటి దశ లో వుండగానే సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం తో ఈ మరణ మృదంగం కనిపిస్తుంది ఆ దేశాల్లో.

అయితే తాజాగా భారత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.భారత్ లో కరోనా ఇంకా స్థానిక వ్యాప్తి దశలోనే ఉందని తెలిపింది. అయితే ఈ వ్యాప్తి మూడో దశకు చేరుకోలేని తెలిపింది. అయితే ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన లాక్ డౌన్ కూడా కారణం. లాక్ డౌన్ ప్రకటన ద్వారా చాలా వరకు కరోనా నీ కట్టడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కరోనా వైరస్ మూడో దశకు చేరుకుంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వెల్లడిస్తుంది అని తెలిపింది. మన దేశంలో జన సంచారం ఎక్కువ కాబట్టి, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా చూడాలి అని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఒకవేళ ఎవరికైనా అనుమానం ఉంటే కాల్ సెంటర్ లని సంప్రదించాలని లవ్ అగర్వాల్ సూచించారు.