కరోనా వేళ: మరో ప్రముఖ సంస్థ భారీగా ఉద్యోగాల తొలగింపు!

Wednesday, May 27th, 2020, 12:16:31 AM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కొన్ని లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అయితే కరోనా వైరస్ ప్రభావం భారత్ లో కూడా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే మహమ్మారి కారణంగా రవాణా సదుపాయాలను కల్పించే సంస్థలకు భారీగా నష్టం వాటిల్లుతుంది. అయితే ఇప్పటికే ఈ రంగంలో ఉన్నటువంటి ఓలా 1,40/ మంది సిబ్బందిని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఓలా బాటలోనే ఉబర్ కూడా ఇపుడు నడుస్తోంది.

అయితే ఉబర్ తన సంస్థ నుండి 600 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంచలన ప్రకటన చేసింది. అయితే అందులో ఎక్కువ శాతం ఉన్నది డ్రైవర్లు అని తెలుస్తోంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో రవాణా రంగం ఇక ప్రస్తుతం కోలుకోవడం కష్టమే అని తెలుస్తోంది.అయితే ఇక భారీ నష్టాలు జరగకుండా ఉండేందుకు ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే తొలగించిన సిబ్బందికి కనీసం 10 వారాల వేతనం తో పాటుగా, ఆరు నెలల మెడికల్ ఇన్సూరెన్స కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఓలా కూడా ఈ నిర్ణయం తీసుకోవడం తో ఇక మున్ముందు ఎలాంటి రంగం పై ఇలా ప్రభావం చూపుతుందో చూడాలి.