కరోనా వైరస్ ధాటికి 811 మంది మృతి…ఇంకా వేల సంఖ్యలో నమోదవుతున్న కరోనా బాధితులు!

Sunday, February 9th, 2020, 10:41:09 AM IST

ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ వైరస్ గా కరోనా నిలిచిపోయింది. ఇప్పటివరకు సార్స్ వైరస్ ద్వారా 774 మంది 2002-03 సమయంలో మరణించారు. కాగా కరోనా వైరస్ ధాటికి 811 మంది మరణించినట్లు చైనా దేశపు జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. ఇప్పటివరకు సార్స్ వైరస్ ద్వారా ఎక్కువమంది చనిపోగా ఆ తరహాలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. అయితే ఈ రెండు వైరస్ లు చైనా లో నే పుట్టడం గమనార్హం. చైనా లో ఇప్పటివరకు కరోనా వైరస్ 37,198 మందికి సోకిందని జాతీయ ఆరోగ్య కమిషన్ తెలియజేసింది. అయితే గడిచిన 24 గంటల్లో మరొక 2656 మంది వైరస్ బారిన పడటం, మరొక 89 మంది మరణించడం అందరిని ఆందోళనకు గురి చేస్తుంది. అయితే ఇందులో ఎక్కువగా వుహాన్ కి చెందిన వారే.

అయితే ఇప్పటివరకు ఈ వైరస్ భారత్ తో సహా దాదాపు 25 దేశాలలో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే చైనా లో కరోనా వైరస్ భారిన పడి చనిపోయిన వారి సంఖ్యని తక్కువ చేసి చూపిస్తున్నారని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఆసుపత్రులలో, టెస్టింగ్ సెంటర్లలో, ల్యాబ్ లలో తీవ్ర ఒత్తిడి ఉందనేది అర్ధం అవుతుంది. కొత్త కేసులు నమోదవుతున్న చైనా మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతుంది. భారత్ లో వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. భారత్ లో ఇప్పటివరకు కేరళ లోనే మూడు కేసులు నమోదయిన విషయం అందరికి తెల్సిందే.