జీజీహెచ్ లో కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తి అదృశ్యం!

Wednesday, July 29th, 2020, 02:24:19 AM IST


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. తెలుగు రాష్ట్రాల్లో లక్షణాలు లేకుండానే ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకుతున్నట్లు అధికారులు సైతం చెబుతున్నారు. అయితే తాజాగా జీ జీ హెచ్ లో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి కనిపించడం లేదు. కడియాల దుర్గ ప్రసాద్ అనే వ్యక్తి ఈ నెల 14 వ తేదీన తెనాలి లోని ఆసుపత్రి లో చేరడం జరిగింది. అక్కడ వైద్య సదుపాయాలు సరిగ్గా లేకపోవడం తో జీ జీ హెచ్ కి తరలించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడికి వచ్చినప్పటి నుండి ఆ వ్యక్తి కనిపించడం లేదు అని తెలుస్తోంది.

ఆ వ్యక్తి భార్య వెంకాయమ్మ 12 రోజుల నుండి భర్త ఆచూకీ కోసం తిరుగుతూనే ఉంది. ఆసుపత్రి లో ఎన్ని వార్డులు తిరిగినా, ఎంత మందిని అడిగినా సమాధానం రాలేదు. అయితే అధికారులు సైతం నోరు మెడపక పోవడం తో ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అధికారులను అడిగినా ఫలితం లేకపోవడం తో చాలా బాధలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ సోకిన వ్యక్తుల పట్ల ఇంత నిర్లక్ష్య ధోరణి పనికి రాదు అని కొందరు అధికారుల పై ఘాటు విమర్శలు చేస్తున్నారు.