కొత్తగూడెం డీఎస్పీ పై కేసు నమోదు…కారణం కరోనా!

Monday, March 23rd, 2020, 08:52:58 PM IST

కరోనా వైరస్ నీ అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఏకంగా రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తూ కేసీఆర్ ప్రకటించారు. కరోనా మహమ్మారి నుండి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని చర్యలు చేపడుతుంటే, బాధ్యతగా ఉండాల్సిన ఒక పోలీస్ అధికారి నిర్లక్ష్యం గా వ్యవహరించారు. విదేశాల నుండి వచ్చినటువంటి తన కుమారుడ్ని క్వారంటెన్ లో పెట్టకుండా డీఎస్పీ తీసుకొని వెళ్ళాడు. ఆ కారణంగా అతని పై పోలీస్ కేస్ నమోదు చేయంది. సెక్షన్ 1897 కింద నమోదు అయింది. అయితే అతని కుమారుడి కి ఇప్పటికే కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే ఈ విషయం పోలీస్ యంత్రాంగం కి తెలియడం తో అప్రమత్తమై వారి కుటుంబీకులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా మరొక షాకింగ్ విషయం ఏమిటంటే ఆ కుటుంబ తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపూడి మండలం, రాఘవపురం లోని ఓ గృహ ప్రవేశ కార్యక్రమానికి హజరయ్యారు. అయితే ఈ విషయం పై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది.