నెహ్రూ జూ పార్క్ లో 8 సింహాలకు కరోనా లక్షణాలు!

Tuesday, May 4th, 2021, 11:03:10 AM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఊహించని రీతిలో ఈ మహమ్మారి తీవ్రత వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే తాజాగా నెహ్రూ జూ పార్క్ లో 8 సింహాలకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే అధికారులు సింహాల నమూనాలు సేకరించి, సీసిఎంబీ కి పంపడం జరిగింది. అయితేే ఇందుకు సంబంధించిన రిపోర్టులు ఈరోజు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా వైరస్ తీవ్రత కారణంగా కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల తో 2 వ తేదీ నుండి జూ పార్క్ ను మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సింహాలకు కరోనా లక్షణాలు సోకడం తో అధికారులు ఆందోళన చెందుతున్నారు.