బిగ్ అలెర్ట్ : ఏపీలో పెరుగుతున్న కరోనా – తాజాగా 44 పాజిటివ్ కేసులు…

Monday, May 25th, 2020, 01:40:56 PM IST

గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ దారుణంగా విస్తరిస్తుంది. ఈ వైరస్ నివారణకై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కీలకమైన నిర్ణయాలు చేపట్టినప్పటికీ కూడా ఈ భయంకరమైన వైరస్ రోజురోజుకు భయంకరంగా పెరుగుతుండటంతో ప్రజలందరుకూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. కాగా రాష్ట్రంలోకి వస్తున్నటువంటి వలసకూలీల వలన ఈ వైరస్ దారుణంగా వ్యాపిస్తుందని చెప్పిన అధికారులు, తాజాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,240 శాంపిల్స్‌ను పరీక్షించగా 44 మందికి కరోనా వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య శాఖా అధికారులు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈ పెరిగిన కేసులతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్యా 2671కి చేరుకుంది. కాగా తాజాగా ఈ వైరస్ భారిన పడిన 41 మంది, ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయినట్లు అధికారులు స్పష్టం చేశారు. కాగా ఇప్పటివరకునమోదైనటువంటిని మొత్తం కేసుల్లో 1848 మంది డిశ్చార్జి కాగా 767 మంది ఆస్పత్రుల్లో ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఇకపోతే కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య మొత్తం 56 మంది కి చేరుకుంది. కాగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల్లో 153 మందికి కరోనా వైరస్ సోకిందని అధికారులు వెల్లడించారు.