భారత్ లో భారీగా పెరుగుతున్నకరొన కేసులు – 1,12,359 కి చేరిన బాధితుల సంఖ్య

Thursday, May 21st, 2020, 09:50:24 AM IST

భారతదేశంలో మహమ్మారి కరోనా వైరస్ కి సంబందించిన పాజిటివ్ కేసులు రోజురోజుకు చాలా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా కరోనా నివారణకై మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా ఎన్నో కీలకమైన చర్యలను తీసుకుంటున్నప్పటికి కూడా ఈ వైరస్ అంతకంతకు పెరుగతుండడంతో ప్రజలందరు కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. కాగా కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో మరణాల సంఖ్య కూడా రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. కాగా కేవలం ఒక్కరోజులోనే 5,000 కంటే అధికంగా కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్రమైన ఆందోళనని కలిగిస్తోంది.

కాగా తాజాగా ఇప్పటివరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో5,609 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకగా, గత 24 గంటల్లో భారత్‌లో 132 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పెరిగిన మరణాలతో దేశంలో మరణాల సంఖ్య మొత్తం 3435కి చేరింది. ఇక కరోనా వైరస్ భారిన పద్దతువంటి బాధితుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,12,359కి చేరింది. ప్రస్తుతానికి కరోనా కారణంగా 63,624 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.