భారత్ లో పెరుగుతున్న కరోనా – గత 24 గంటల్లో 6,977 పాజిటివ్ కేసులు…

Monday, May 25th, 2020, 11:20:22 AM IST

భారత్ లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకు చాలా భయంకరంగా పెరిగిపోతుంది. ఈ మహమ్మారిని నివారించడానికి మన ప్రభుత్వాలు ఎన్నో కీలకమైన ‘చర్యలు చేపట్టినప్పటికీ కూడా భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కాగా గత నాలుగు రోజులుగా భారత్ లో 6,000 పైగా కేసులు నమోదు నమోదవడంతో ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. కాగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో 6,977 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ గా అయింది. దానికితోడు ఒక్కరోజులోనే కరోనా కారణంగా 154 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.

ఇకపోతే మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే… మహమ్మారి కరోనా భారిన సంఖ్య మొత్తం 1,38,845కి చేరగా, మృతుల సంఖ్య 4,021కి చేరుకుంది. 77,103 మందికి ఆసుపత్రుల్లో ఇప్పటికి కూడా చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా కరోనా భారిన వారిలో ఇప్పటికి 57,720 మంది పూర్తిగా కోలుకొని, ఆసుపత్రుల నుండి డీఛార్జ్ అయ్యారు.