బిగ్ అలెర్ట్ : తెలంగాణాలో మరొక మూడు పాజిటివ్ కేసులు…

Thursday, March 26th, 2020, 02:31:35 PM IST


భారత్ లో కరోనా వైరస్ భయంకరంగా వ్యాపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా మహమ్మారి కరోనా వైరస్ తన పంజా వేసుకుంటూ పోతుంది. అయితే రెండుతెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ చాలా భయంకరంగా వ్యాపిస్తూ పోతుంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, తెలంగాణ రాష్ట్రంలో 41ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారందరిని కూడా హైదరాబాద్ లో ని ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరొక మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలంగాణ రాష్ట్ర వైద్యాధికారులు అధికారికంగా వెల్లడించారు.

అయితే ఈ పెరిగిన కేసులతో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 44 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సమాచారం. ఇకపోతే పెరిగిన ఈ కరోనా వైరస్ కేసుల్లో ఇద్దరు డాక్టర్లు ఉన్నారని తాజా సమాచారం. అంతేకాకుండా వైరస్ మరింతగా పెరిగే అవకాశాలున్నాయని, వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ భయంకరమైన కరోనా వైరస్ నుండి నివారణ పొందగలమని, అందుకనే ప్రజలందరూ కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు గాను సహకరించాలని కోరుతున్నారు.