బిగ్ అలెర్ట్ : తెలంగాణాలో పెరుగుతున్న కరోనా కేసులు…

Saturday, May 23rd, 2020, 09:07:21 AM IST

గత కొంత కాలంగా రాష్ట్రంలో మహమ్మారి కరోనా కి సంబందించిన పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలకమైన చర్యల కారణంగా కరోనా వైరస్ తగ్గుతుందని అధికారులు వెల్లడించినప్పటికీ కూడా, పలు ప్రాంతాల్లో రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భయంకరంగా పెరుగుతుండడంతో ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. కాగా రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా అధికారులందరు కూడా ఒక స్పష్టతకు వచ్చారు.

కాగా తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కాగా ఇటీవల ముంబై నుండి వచ్చినటువంటి వలస కార్మికుల కారణంగానే మంచిర్యాల జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. కాగా తాజాగా జిల్లాలో ముంబై నుంచి వచ్చిన మరో 6 గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాధితులను అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27కు చేరుకుంది. అప్రమత్తమైన అధికారులు మరిన్ని కీలకమైన చర్యలు తీసుకుంటున్నారు.