హై అలెర్ట్ : తెలంగాణాలో 39 కి చేరిన కరోనా కేసులు…

Wednesday, March 25th, 2020, 12:45:17 AM IST

తెలంగాణ రాష్ట్రంలో భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ మరింత భయంకరంగా విస్తరిస్తుంది. కాగా తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల కేసులు 39 కి చేరుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖా ఒక లేఖను కూడా విడుదల చేసింది. రాష్ట్రారోగ్య మంత్రిత్వ శాఖ చెప్పిన లెక్కల ప్రకారం మంగళవారం నాడు అర్థరాత్రి 11 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మరొకరిద్దరికి ఈ మహమ్మారి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు అధికారికంగా వెల్లడించారు.

కాగా తెలంగాణ ఆరోగ్య విభాగం ప్రకారం… పాజిటివ్‌గా పరీక్షించిన రెండు కొత్త కేసులు డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (కొత్తగూడెం), వారి ఇంటిలోని వంట మనిషి కి కూడా ఈ కరోనా వైరస్ సోకిందని సమాచారం. కాగా ఇటీవల కొత్తగూడెం DSP కుమారుడు లండన్ నుండి తిరిగి వచ్చాడు. అయితే అతను క్వారెంటైన్ నియమాలను ఉల్లంఘించడం ద్వారా ఈ దారుణం జరిగిందని భావించిన ప్రభుత్వం DSP, అతడి కుమారుడిపై కేసు నమోదు చేసింది.