మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి సోకిన కరోనా వైరస్…

Monday, May 25th, 2020, 12:43:27 PM IST


మనదేశంలో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకు చాలా భయంకరంగా వ్యాపిస్తుంది. కాగా ఈ వైరస్ ని నివారించడానికి మన ప్రభుత్వాలు అన్ని కలిసి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ వైరస్ వ్యాప్తి పెరగడంతో ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. కాగా ప్రత్యేకముగా చెప్పాలంటే దేశంలో మహారాష్ట్రలో చాలా కేసులు నమోదవుతున్నాయి. కాగా మహారాష్ట్రలో ఇప్పటికే మహారాష్ట్రలో 50,231 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా, ఈ వైరస్ కారణంగా 1,635 మంది మృతి చెందారు.

ఇకపోతే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అశోక్ చవాన్‌కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిందని సమాచారం. మయితే కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో, అనుమానం వచ్చిన వైద్యులు అతడికి కరోనా\ పరీక్షలు జరిపించగా, పాజిటివ్ గా నిర్దారణ అయ్యిందని సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతానికి ఆయనకు తన స్వగ్రామంలోనే అవసరమైన చికిత్స అందిస్తున్నారని వైద్యాధికారులు తెలిపారు.