కరోనా రూపంలో వడగళ్ల వాన.. సోషల్ మీడియాలో వైరల్..!

Thursday, May 21st, 2020, 11:13:17 PM IST

ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తుంది. చైనా దేశంలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ అంచెలంచెలుగా ప్రపంచ దేశాలకన్నిటికి పాకిపోయింది. కరోనా దెబ్బకు అగ్ర దేశాలు సైతం చతికిలపడ్డాయి. అయితే కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇన్ని రోజులు లాక్‌డౌన్ పాటిస్తున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

అయితే ప్రస్తుతానికి ఇంకా కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో చాలా దేశాలు లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చుకున్నాయి. ఇదిలా ఉంటే మెక్సికోలోని మోంటేమోరేలోస్ మున్సిపాలిటీలో నేడు భారీ వడగళ్ల వర్షం కురిసింది. ఇందులో వింత ఏముందని అనుకుంటున్నారా అది సాదా సీదా వడగళ్ల వాన కాదండోయ్ కరోనా వడగళ్ల వాన. దీంతో అక్కడి జన్మంతా ఆ మంచు ముద్దలను ఫఒటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.