బిగ్ అప్డేట్ : ఏపీలో విజృంబిస్తున్న కరోనా వైరస్ – ఇప్పటికే 87 పాజిటివ్ కేసులు…

Wednesday, April 1st, 2020, 12:56:42 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. తాజా లెక్కల ప్రకారం చూసుకుంటే ఇప్పటికి నమోదైన కేసుల వివరాల ప్రకారం కరోనా పాజిటివ్ కేసులు 87 కి చేరుకున్నారని అధికారికంగా వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ వైద్యాధికారులు… ఇవన్నీ కేవలం 12 గంటల్లోనే నమోదవడంతో అధికారులు, ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. అయితే కరోనా సోకిందన్న అనుమానంతో ఉన్న వారందరిని అంటే దాదాపుగా 373 మందిని పరిశీలించగా, వారందరిలో 43 కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే బయట తిరుగుతున్న వారు, ఇటీవల ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి వల్లే ఈ వైరస్ ఇంత దారుణంగా విస్తరించిందని అధికారులు చెబుతున్నారు.అయితే ఈ వైరస్ భారీ నుండి మనం బయటపడటానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వానికి, ప్రభుత్వ చర్యలకు అందరు కూడా సహకరించాలని అధికారులు పలు హెచ్చరికలు చేశారు.

జిల్లాల వారిగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు…

ప్రకాశం – 15
కడప – 15
పశ్చిమగోదావరి – 13
విశాఖ – 11
కృష్ణా – 6
కర్నూలు – 1
నెల్లూరు – 3
అనంతపురం – 2
చిత్తూరు – 6
తూర్పుగోదావరి – 6
గుంటూరు – 9