మానసిక ఒత్తిడిలో వుంటే శృంగారం చేయండి అంటున్న నిపుణులు? ఎందుకో తెలుసా.?

Sunday, June 11th, 2017, 01:05:43 PM IST

ప్రస్తుతం రోజు వారి జీవితంలో ప్రతి ఒక్కరు పరుగులు పెడుతున్న ప్రపంచంలో ప్రయాణించలేక, రకరకాల కారణాలతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ రకమైన మానసిక ఒత్తిళ్ళు ఇండియాలో ఇంకా ఎక్కువగా ఉంది. అయితే తాజాగా కొంత మంది మానసిక వైద్య శాస్త్రవేత్తలు ఓ విషయాన్ని అందరికి తెలియజేసారు. తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నవారు, వారి జీవితంలో శృంగారానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే అని చెప్పారు. భార్యతో కాని, ప్రియురాలితో గాని శృంగారంలో పాల్గొనే వ్యక్తులు ఎక్కువ సంతోషంగా, ఎలాంటి ఒత్తిడికి గురుకాకుండా పనులు చేసుకుంటున్నారని తెలియజేసారు. అందుకే మానసిక ఒత్తిడిలో ఉన్నవాళ్ళు శృంగారం చేస్తే, ఆ ఒత్తిడి నుంచి కొత్త ఉపశమనం పొందొచ్చని చెబుతున్నారు. భారతీయులు శృంగారం అంటే అదేదో పెద్ద తప్పుగా భావిస్తారని, కాని మనసులోని తీవ్రమైన ఒత్తిడికి గురిచేసే ఆలోచనలని దూరం చేసుకోవడానికి శృంగారం మంచి ఔషధంగా పనిచేస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. షో. ఇకపై పెళ్ళైన భార్యతో శృంగారానికి దూరంగా వుండే పురుషులు కాస్తా ఈ విషయాన్ని ద్రుష్టిలో ఉంచుకొని ఒత్తిడి దూరం చేసుకునే ప్రయత్నం చేయండి.