సంచలన తీర్పు: హాజీపూర్ హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష..!

Thursday, February 6th, 2020, 07:16:17 PM IST


హాజీపూర్ హత్యల కేసు నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి కోర్ట్ ఉరిశిక్షను వేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు బాలికలకు బైక్‌పై లిఫ్ట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి అత్యచారానికి పాలపడి వారిని చంపి బావిలో పడేశాడు. అయితే ఈ కేసులి అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడంతో సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

అప్పటి నుంచి ఈ కేసును విచారణ చేపట్టి కీలక ఆధారాలు సేకరించారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి సెల్‌ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లు, వీడియోలను బట్టి అతనే హత్యలకు పాల్పడినట్టు నిర్ధారించగా, ఫోరెన్సిక్ రిపోర్టులో కూడా శ్రీనివాస రెడ్డే ఈ దారుణాలకు పాల్పడినట్లు తేలింది. అంతేకాదు ఈ కేసులో పోలీసులు 300 మంది సాక్షుల్ని ప్రశ్నించగా 101 మంది సాక్షులు చెప్పిన విషయాలను పూర్తిగా కోర్ట్‌కి సమర్పించారు. అయితే అన్ని ఆధారాలను పరిశీలించిన ఫోక్సో స్పెషల్ కోర్టు శ్రీనివాస్ రెడ్డిని దోషిగా తేల్చింది. అయితే దీనిపై న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డిని అడగగా తాను మాత్రం నిర్ధోషిని అని, తనను బలవంతగా ఈ కేసులో ఇరికించారని చెబుతున్నా అతనే నేరం చేశాడని నిరూపించేందుకు డీఎన్ఏ, రక్తపరీక్షలు, పోస్టుమార్టం రిపోర్టు, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు, సెల్ ఫోన్ సిగ్నల్స్, అతని పాత నేరాలు అన్నీ పక్కా ఆధారాలుగా చూసుకుని కోర్ట్ అతనికి ఉరిశిక్షను ఖరారు చేసింది. అయితే కోర్ట్ ఉరిశిక్షను ఖరారు చేయడంతో, తీర్పును అమలు చేసేందుకు అధికారులు తమ ప్రక్రియను సిద్దం చేసుకోబోతున్నారు.