టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం.. మళ్ళీ రిమాండ్ పొడిగింపు..!

Saturday, June 27th, 2020, 01:11:44 AM IST


ఏపీ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఫోర్జరీ కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలకు అనంతపురం కోర్టు జూలై 1 దాకా రిమాండ్‌ పొడిగించింది.

అయితే ప్రస్తుతం కడప జైలులో ఉన్న తండ్రీ, కొడుకులను పోలీసులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయమూర్తి ముందు విచారణకు హాజరుపరిచారు. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి రిమాండ్‌ పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలకు బెయిల్‌ ఇవ్వాలని అనంతపురం జిల్లా కోర్టులో వారి తరఫు న్యాయవాదులు పిటిషన్‌లు దాఖలు చేయగా దీనిపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.