ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కి కోర్టు నోటీసులు – ఎందుకంటే…?

Saturday, December 14th, 2019, 02:32:00 AM IST

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కి హై కోర్ట్ నోటీసులు జారీ చేసింది. కాగా బెయిల్‌ షరతులను ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఉల్లంఘించారని వస్తున్నటువంటి ఆరోపణల కారణంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే గత 2012 లో నిజామాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సభలో అక్బరుద్దీన్ కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన కేసులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కోర్టు నుండి గతంలోనే బెయిల్ పొందారు. కాగా ఇకపోతే ఎమ్మెల్యే అక్బరుద్దీన్ బెయిల్‌ షరతులకు విరుద్ధంగా ఇప్పటికీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయనకు కేటాయించిన బెయిల్ ని తక్షణమే రద్దు చేయాలనీ హిందూ సంఘటన్‌ అధ్యక్షుడు, న్యాయవాది కరుణ సాగర్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈమేరకు అక్బరుద్దీన్‌ బెయిల్‌ను రద్దు చేయాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను కింది కోర్టు కొట్టేయడంతో హైకోర్టులో రిట్‌ దాఖలు చేశారు.