తిక్క కుదిరెన్‌: 22ల‌క్ష‌లు, వ‌డ్డీ చెల్లిస్తున్న హీరోయిన్‌

Tuesday, October 17th, 2017, 12:45:14 PM IST

అయ్యో పాపం.. ఆప‌ద‌లో ఉందిలే అని స్నేహం కోసం అప్పు ఇచ్చింది ఆ ఫ్రెండు. వందో .. వెయ్యో కాదు.. ద‌ఫ ద‌ఫాలుగా ల‌క్ష‌ల్లో అప్పుగా ఇచ్చింది. ఫ్రెండు క‌దా.. అని అడ్వాంటేజ్ తీసుకున్న స‌ద‌రు హీరోయిన్ ఏకంగా 22 ల‌క్ష‌లు అప్పు చేసింది. అయితే అప్పు చేసింది స‌రే.. ఆ అప్పు చెల్లించాలి క‌దా! చెల్ల‌ని చెక్కులు చేతిలో పెట్టి అప్పు తీరిపోయింది అంటే ఎవ‌రైనా ఊరుకుంటారా? అందుకే త‌న‌ద‌గ్గ‌ర తీసుకున్న డ‌బ్బు తిరిగి వ‌చ్చే వార‌కూ త‌న‌ని వ‌దిలిపెట్టకూడ‌ద‌ని అందుకుంది. ఫ‌లితంగా స‌ద‌రు హీరోయిన్ కోర్టుగ‌డ‌ప ఎక్కాల్సొచ్చింది.

త‌న‌కు చెల్లించాల్సిన 22ల‌క్ష‌ల అప్పు చెల్లించ‌కుండా చెక్ బౌన్స్ అయ్యేందుకు కార‌కురాలైన స‌ద‌రు హీరోయిన్‌పై గెలిచే వ‌ర‌కూ పోరాడింది ఆ స్నేహితురాలు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో పేర్లు రివీల్ చేస్తే.. బాలీవుడ్ క‌థానాయిక కోయినా మిత్రా.. త‌న ఫ్రెండు పూన‌మ్ సేథి మ‌ధ్య లాలూచీకి సంబంధించిన వ్య‌వ‌హార‌మిది. అవ‌స‌రంలో ఫ్రెండును ఆదుకున్న పాపానికి పోయినందుకు..స‌ద‌రు స్నేహితురాలు పోలీసు కేసుల్లో తిర‌గాల్సొచ్చింది. ఈ కేసు 2016 నుంచి కోర్టులో న‌డుస్తోంది. 2012 స‌మ‌యంలో కోయినా అప్పు తీసుకుంది. కానీ ఆ త‌ర్వాత చెల్ల‌ని చెక్‌లు ఇచ్చింది. దాంతో సొమ్ము రిక‌వ‌రీ కోసం స్నేహితురాలు.. కేసు వేసింది. అది ఇన్నాళ్టికి ఓ కొలిక్కి వ‌చ్చింది. ఈ వివాదం విష‌య‌మై కోర్టు తీర్పు వెలువ‌రించింది. కోయినా 22 ల‌క్ష‌లు తిరిగి చెల్లించ‌డ‌మే కాకుండా 9 శాతం వ‌డ్డీ చొప్పున లెక్క‌గ‌ట్టి మొత్తం సొమ్ముల్ని త‌న ఫ్రెండుకి చెల్లించాల‌ని తీర్పు వెలువ‌రించింది. స్నేహం ప‌రువు తీసిన క‌థానాయిక‌ తిక్క కుదిరే తీర్పు ఇదని చెప్పొచ్చు.