గాంధీ ఆసుపత్రిలో కవలలకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు..!

Wednesday, May 27th, 2020, 02:23:07 AM IST

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నా కరోనా నుంచి కోలుకుని రికవరీ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.

అయితే తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు కరోనా సోకిన గర్భిణీకి ప్రసవం చేశారు. మేడ్చల్‌కి చెందిన గర్భిణీకి కరోనా పాజిటివ్ అని తేలడంతో గాంధీలో చికిత్ద చేస్తున్నారు. అయితే నిన్న వైద్యులు ఆమెకు ప్రసవం చేయడంతో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అయితే తల్లికి నెగిటివ్ వచ్చాక బిడ్డలను తల్లి ఒడికి చేరుస్తామని పేర్కొన్నారు.