కరోనా పేషంట్లకు షాక్.. అలాంటి వారికి ఆ ధరలు వర్తించవు..!

Monday, July 27th, 2020, 08:35:42 AM IST

తెలంగాణ సర్కార్ కరోనా పేషంట్లకు మరో షాక్ ఇచ్చింది. కరోనా సోకి ప్రైవేట్ ఆసుపత్రులలో చేరిన వారి నుంచి ఆసుపత్రిని బట్టి లక్షలు లక్షలు దండుకుంటున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే గతంలో కరోనా పేషెంట్లకు ప్రైవేట్ ఆస్పత్రులు ఏ విధమైన చికిత్సకు ఎంత వసూలు చేయాలనే అంశంపై గతంలో ఓ జీవో జారీ చేసింది.

అయితే ఆ ఆదేశాలకు అదనంగా తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా మరికొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాల ప్రకారం కరోనా సోకిన వ్యక్తి హెల్త్‌ ఇన్సూరెన్స్ కింద ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన ధరలు వారికి వర్తించవని, స్పాన్సర్లు, కార్పోరేట్ సంస్థలు ఆస్పత్రులతో ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు చేసుకుని ఆ ఒప్పందాల కింద కరోనాకు చికిత్స చేయించుకోవాలనుకునే వారికి కూడా ప్రభుత్వం చెప్పిన ధరలు వర్తించవని జీవో ద్వారా తేల్చి చెప్పారు.