రంగనాయకమ్మ కేసుపై సీఐడీ కీలక ప్రకటన..!

Friday, May 22nd, 2020, 02:08:19 AM IST

ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నా అభియోగాలతో కేసు ఎదుర్కొంటున్న రంగనాయకమ్మ గురువారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. అయితే ఉద్దేశపూర్వకంగానే ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెట్టారని సీఐడీ ఈ విచారణలో తేల్చి చెప్పింది. రంగనాయకమ్మ ప్రభుత్వంపై బురదజల్లేలా సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి పోస్టులు పెట్టడం వెనుక రంగనాయకమ్మ సరైన కారణాలు, సమాధానం చెప్పలేదని సీఐడీ పేర్కొంది.

అయితే ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం గురించే కాకుండా అమ్మఒడి, రైతుభరోసా, వాహనమిత్ర పథకాలను ఎద్దేవా చేస్తూ పోస్టులు పెట్టారు. ఎల్జీ ప్రమాదంపై ఎం జరిగిందో దానినే తాను పేస్‌బుక్‌లో పెట్టానని వివరించారు. అలా పోస్టులు పెట్టడం తప్పని కూడా తనకు తెలియదన్నారు.